అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి సంపన్నుడు!
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి మీడియాతో మాట్లాడుతూ తన పోటీ గురించి అధికారికంగా వెల్లడించారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రకటన చేయడం పట్ల గర్వంగా ఉంది. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరిక్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం ఇది. నేను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దానికంటే ముందు అమెరికా అంటే ఏంటో తిరిగి కనుక్కోవాలి. అలాగే చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అని వెల్లడించారు.






