JP Morgan: డొనాల్డ్ ట్రంప్ చర్యలతో ఉద్యోగాలుండవ్ : జేపీ మోర్గాన్

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చర్యలతో ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ (JPMorgan) అంచనా వేసింది. ఇంతకుముందు 40 శాతం ఉన్న ఈ అవకాశం ఇప్పుడు 60 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. అంతేకాకుండా దేశ స్థూల దేశీయోత్పత్తి పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ దేశాలపై యూఎస్ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలే దీనికి ప్రధాన కారణమని జేపీ మోర్గాన్ సీఈవో మైఖేల్ ఫెరోలి (Michael Ferroli) పేర్కొన్నారు. మాంద్యం వల్ల అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరుగుతుందని, దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలుండవని (Jobs) పేర్కొన్నారు.