jaishankar :ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జైశంకర్

ఈ నెల 20వ తేదీన జరిగే అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన దేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (jaishankar) హాజరవనున్నారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (J.D. Vance) కూడా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అక్కడ అమెరికా పరిపాలన అధికారులు, భారత్ అధికారులు, వివిధ దేశాల అధినేతలతో జరిగే చర్చల్లో మంత్రి జై శంకర్ పాల్గొంటారని వెల్లడిరచింది.