న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి జెన్నిఫర్ రాజ్‌కుమార్ ఎన్నిక
భారత సంతతికి చెందిన జెన్నిఫర్ రాజ్‌కుమార్(38) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికా రాజకీయాల్లో, పరిపాలనలో కీలకంగా భావించే న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దక్షిణాసియాకు చెందిన ఓ మహిళ న్యూయార్క్ అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఇదే మొదటిసారి. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జెన్నిఫర్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గియోవన్ని పెర్నాపై గెలిచి చరిత్ర సృష్టించారు. కాగా సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో జెన్నిఫర్ న్యాయవాధిగా, ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.






