Donald Trump : జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంగళవారం చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)తోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తున్న ట్రంప్ 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కీవ్ అంగీకరించినా మాస్కో (Moscow ) మాత్రం షరతులు పెట్టింది. పుతిన్‌తో జరిపిన చర్చల ఆధారంగా జెలెన్‌స్కీతో సంభాషణ సాగిందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఉక్రెయిన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను భద్రత నిమిత్తం తమకు అప్పగించాలని ట్రంప్ సూచించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో (Mark Rubio) తెలిపారు.