Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం… మనోళ్లపై మరో పిడుగు

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్-1బీ వీసాలు(H-1B visa), గ్రీన్‌కార్డు (green card) లు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ-5) అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ-5 (EB-5) కేటగిరిలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ-5 కేటగిరి కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు. నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే తుది కార్యచరణ తేదీ లు చాలా కీలకం. వీసా/ గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్‌షిప్ (US Citizenship), ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ-5 కటాఫ్‌ను మార్చకపోవడం వివేషం.