డ్యాన్స్ వీడియో ట్వీట్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ప్రత్యేకమే. అలా తన దృష్టిని ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు ట్రంప్. కొన్ని సందర్భాలు, సన్నివేశాల్లో సమయానికి అనుగుణంగా అందరిన్నీ ఉత్సాహపరుస్తూ తనదైన ముద్ర వేసుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ పక్రియ కొనసాగుతున్న సందర్భంగా ట్రంప్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. వేర్వేరు ప్రచార ర్యాలీల్లో మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ నృత్యం చేసిన దృశ్యాలను ఒకటిగా చేసి ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు ఓట్.. ఓట్..ఓట్ అంటూ ట్రంప్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ట్రంప్ మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు. ట్రంప్ డ్యాన్స్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేశారు.






