కరోనా కాటేసినా ట్రంప్ కు జయహో…
అమెరికాను కరోనా మహమ్మారి అతలాకుతలం చేయటానికి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నప్పటికీ కరోనా విపరీతంగా వ్యాపించిన కొన్ని ప్రాంతాల్లో ఆయనకు అనూహ్య మద్దతు లభించటం విచిత్రమైన విషయం. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 376 కౌంటీల ప్రజలు ఎన్నికల్లో ట్రంప్‌కే జై కొట్టారు. మోంటానా, నెబ్రాస్కా, విస్కాన్సిస్, అయోవా, ఉత్తర దక్షిణ డకోటా రాష్ట్రల్లోని కొన్ని కౌంటీల్లో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 93 శాతం ట్రంప్‌కే పడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు గంపగుత్తగా ట్రంప్‌కు ఓటేశారని అమెరికా మీడియా వెల్లడించింది.






