డొనాల్డ్ ట్రంప్ కు గ్రెటా చురకలు
డొనాల్డ్ ట్రంప్‌కు స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ (17) చురకలు అంటించారు. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. చిల్..డొనాల్డ్ ట్రంప్ …చిల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ అవకాశం కోసం గ్రెటా 11 నెలల వేచి చూడాల్సి వచ్చింది. తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగులుతున్న సమయంలో చూసి ట్రంప్‌పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఓటమిని అంగీకరించకలేక స్టాప్ ది కౌంట్ అంటూ కుపితుడైపోతున్న ట్రంప్‌ను ఆమె ట్రోల్ చేశారు. చాలా హాస్యాస్పదం..డొనాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందు కోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి చిల్ డొనాల్డ్ చిల్ అంటూ థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. దీంతో అప్పటి ట్వీట్‌ను వ్యంగ్యంగా ప్రస్తుత సమయానికి అన్వయిస్తూ.. ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు.






