America : 30 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోండి : అమెరికా హెచ్చరిక

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారు (Illegal residents) తక్షణమే వారంతట వారే దేశం విడిచి పెట్టి వెళ్లాలని అగ్రరాజ్యం మరోసారి హెచ్చరించింది. విమాన టికెట్టు (Flight ticket) ఖర్చును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అమెరికా (America )లో 30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు తప్పని సరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని హోంశాఖ (Home Ministry) సూచించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణించి అపరాద రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అక్రమంగా ఉంటున్నట్లయితే మీ అంతట మీరు అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గం. సామాన్లు సర్దుకుని విమానం ఎక్కండి. నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తాం. తుది ఉత్తర్వు అందుకున్నవారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్ల జరిమానా పడుతుంది. స్వచ్ఛందంగా వెళ్లిపోకపోతే 1,000 నుంచి 5,000 డాలర్ల జరిమానా విధిస్తాం. జైలు శిక్ష కూడా పడవచ్చు. అలాంటివారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదు అని వివరించింది.