Dallas: డల్లాస్‌లో ‘సత్యభామ’ పూర్వ విద్యార్థుల కలయిక

చెన్నై సత్యభామ (Satyabama) కళాశాలలో ఎంసిఎ విద్యనభ్యసించిన 2000 బ్యాచ్ పూర్వ విద్యారులు ఇటీవల డల్లాస్ (Dallas) లో ఆత్మీయంగా కలుసుకున్నారు. అమెరికా నలుమూలల నుండి సత్యభామ విద్యార్థులు ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి తరలివచ్చి తమ బ్యాచ్‌మేట్స్‌ను కలుసుకుని సరదాగా గడిపారు. అప్పటి మధురస్మృతులను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.