Chiru Venky: సంక్రాంతికి సీనియర్ హీరోల రచ్చ గ్యారెంటీ

ఈ ఇయర్ పండక్కి సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunnam) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్(venkatesh) ఆ సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచనతో తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(trivikram) తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటూ చిరంజీవి (chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు(mana shankara varaprasad Garu) మూవీలో కూడా వెంకీ నటిస్తున్నారు.
వెంకీ(venky) కోసం అనిల్ ఓ స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేయగా, సినిమాలో వెంకీ పాత్ర ఆద్యంతం అలరించేలా ఉంటుందని మేకర్స్ ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. కాగా మంగళవారం(అక్టోబర్ 21) నుంచి వెంకీ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సినిమాలో వెంకీకి సంబంధించిన సీన్స్ మరియు ఓ పాటను కూడా అనిల్ ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
సినిమాలో వెంకీ క్యారెక్టర్ సెకండాఫ్ లో వస్తుందని, అనిల్ డిజైన్ చేసిన పాత్ర నచ్చడంతో వెంకటేష్ వెంటనే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని, దీని కోసం వెంకీ మంచి పారితోషికాన్ని కూడా అందుకుంటున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం మన శంకరవరప్రసాద్ గారు నుంచి వెంకీ పాత్రకు సంబంధించిన ప్రోమో అతి త్వరలోనే ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం వచ్చే సంక్రాంతికి సీనియర్ హీరోలిద్దరూ కలిసి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు.