Jubilee Hills: కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు : కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిరచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్నాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (Deepak Reddy) నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హామీలను నెరవేర్చని కాంగ్రెస్ (Congress) కు ఓటు అడిగే నైతిక హక్కే లేదన్నారు. బీఆర్‌ఎస్ (BRS)కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా సమస్యలేనని, ఒక్కటీ పరిష్కరించడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన మహిళలకు రూ.2,500, తులం బంగారం 4 లక్షల ఉద్యోగాలు, దళిత కుటుంబానికి రూ.12 లక్షలు, బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా మాటలు చెబుతున్నారని, రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రస్ సర్కారు కొద్ది కాలంలోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్ మద్దతిస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండి సమస్యలు వినే దీపక్‌రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.