“100% బౌలర్, 100% బ్యాటర్”.. ఢిల్లీ కొత్త సెన్సేషన్..!
ఐపీఎల్ 2026లో(IPL 2026) ఢిల్లీ క్యాపిటల్స్ ఒక కొత్త వజ్రాన్ని వెలికితీసింది. పంజాబ్ కింగ్స్‌తో(PBKS) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ(Madhav Tiwari) తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాటుతోనూ, బంతితోనూ చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ కుర్రాడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ 22 ఏళ్ల యువ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీకి చావో రేవో లాంటి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.
బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి కీలకమైన 2 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ కీలక సమయంలో వేగంగా పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మాధవ్ తివారీని నెటిజన్లు “100% బౌలర్, 100% బ్యాటర్” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మాధవ్ తివారీ ప్రదర్శనపై ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ఢిల్లీకి ఒక పక్కా ఆల్‌రౌండర్ దొరికాడు”, “భవిష్యత్తులో టీమిండియాకు మంచి ఆస్తి కాబోతున్నాడు” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అండర్ డాగ్‌గా వచ్చి మ్యాచ్ విన్నర్‌గా మారిన మాధవ్ కథ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఇన్స్పైర్ చేస్తోంది. మాధవ్ తివారీ ప్రదర్శనపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని మాధవ్ ఆడిన తీరు అద్భుతమని, జట్టుకు కావాల్సిన ఎనర్జీని అతను ఇచ్చాడని కొనియాడాడు. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండటంలో మాధవ్ పాత్ర మరవలేనిది.
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ అనే చిన్న గ్రామం నుండి వచ్చిన 22 ఏళ్ల మాధవ్ తివారీ కథ చాలా ప్రత్యేకం. సాధారణంగా ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు రంజీ ట్రోఫీ లేదా సయ్యద్ ముస్తాక్ అలీ వంటి సీనియర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడి గుర్తింపు పొందుతారు. కానీ, మాధవ్ తివారీ ఇప్పటివరకు ఎటువంటి సీనియర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే నేరుగా ఐపీఎల్లో తన ముద్ర వేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ ఇయాన్ బెల్ పర్యవేక్షణలో తన బౌలింగ్ మరియు రేంజ్-హిట్టింగ్‌ను మెరుగుపరుచుకున్నట్లు మాధవ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి






