T20 World Cup: టీంలో అతనికి షాక్ ఇవ్వనున్న గంభీర్..?
భారత జట్టు సూపర్ 8(Super 8 Stage) దశకు చేరుకుంది అనే సంతోషం కంటే.. కొందరు ఆటగాళ్ళు పదే పదే విఫలం కావడాన్ని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోవడం లేదనే మాట వాస్తవం. ముగ్గురు నలుగురు ఆటగాళ్ళపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వారు ఫెయిల్ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓపెనర్ అభిషేక్(Abhishek Sharma) శర్మ, 3 వ స్థానంలో వచ్చే తిలక్ వర్మ(Tilak Varma), 6వ స్థానంలో వచ్చే రింకూ సింగ్. ఈ ముగ్గురిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వీరి ఆట తీరు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది.
ఆడితే అతి వృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా వీరి ఆట తీరు ఉంటుంది అనే విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ వరుసగా మూడు మ్యాచ్ లలో డకౌట్ అయ్యాడు. ఒక్క మ్యాచ్ లో కూడా అంచనాలకు తగ్గట్టుగా ఈ టోర్నీలో ఆడలేదు. దీనితో సూపర్ 8 మ్యాచ్ లలో అతనిని పక్కన పెడితే మంచిది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అతనికి ఒకటి రెండు మ్యాచ్ లు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అతని స్థానంలో సంజూ సామ్సన్(Sanju Samson) కు అవకాశం ఇస్తే మంచిది అని ఫ్యాన్స్ కోరుతున్నారు. సంజు సామ్సన్ కూడా ఫెయిల్ అవుతున్నా సరే.. అభిషేక్ ను పక్కన పెట్టి ఆడిస్తే అతనిలో బాధ్యత పెరుగుతుందని మాజీలు కూడా అంటున్నారు. అందుకే సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో అభిషేక్ ను పక్కన పెట్టి.. సంజుకు అవకాశం ఇవ్వాలని టీం ఇండియా యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్ స్టంప్ బంతులను ఆడే విషయంలో అభిషేక్ ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో.. టీం ఇండియా బ్యాటింగ్ కోచ్.. అతనిపై ఫోకస్ చేసాడు.

















