Lakshya Sen: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్.. చివరి మెట్టుపై లక్ష్యసేన్ బోల్తా!
భారత క్రీడాభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్’ (All England Open) సూపర్-1000 టోర్నీలో యువ సంచలనం లక్ష్యసేన్‌కు (Lakshya Sen) తీవ్ర నిరాశ ఎదురైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో చైనీస్ తైపీ (తైవాన్) ఆటగాడు లిన్ చున్-యీ చేతిలో పరాజయం పాలై, రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి
తుదిపోరులో హోరాహోరీ.. చేజారిన టైటిల్..
సెమీఫైనల్లో ప్రపంచ ఆరవ ర్యాంకర్ లీ షీఫెంగ్ను చిత్తుచేసి అత్యంత ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టిన 24 ఏళ్ల లక్ష్యసేన్ (Lakshya Sen).. టైటిల్ మ్యాచ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తైవాన్ ఆటగాడు లిన్ దూకుడుగా ఆడాడు. కోర్టులో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారత షట్లర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను 21-15 తేడాతో అలవోకగా సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకున్నాడు. పాయింట్ల కోసం నువ్వా-నేనా అన్నట్లు తీవ్రంగా ప్రతిఘటించాడు. అయితే ఆఖరి నిమిషాల్లో ఒత్తిడికి లోనై 20-22 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
లిన్ తిరుగులేని ఆధిపత్యం..
లక్ష్యసేన్‌కు (Lakshya Sen) లిన్ చున్-యీ అస్సలు కొరుకుడు పడటం లేదు. అంతర్జాతీయ కెరీర్లో వీరిద్దరూ ముఖాముఖిగా తలపడటం ఇది ఐదోసారి కాగా, ప్రతిసారీ (5-0) లిన్ చేతిలోనే సేన్‌కు పరాజయం ఎదురవడం గమనార్హం. మరోవైపు ఈ విజయంతో లిన్ చున్-యీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టైటిల్‌ను ముద్దాడిన మొట్టమొదటి చైనీస్ తైపీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. లక్ష్యసేన్ తుది మెట్టుపై బోల్తా పడినా, టోర్నీ ఆసాంతం చూపించిన పోరాట పటిమ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
ఇవి కూడా చదవండి






