అన్నమయ్యపురంలో 618వ అన్నమయ్య జయంతి సందర్భంగా “వేసవి వెన్నెల” ఉచిత అన్నమయ్య కీర్తనల శిక్షణా తరగతులు
“భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ” అన్న సిద్ధాంతంతో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ గత 46 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. సంస్ధ అధ్యక్షులు, “అన్నమయ్య పద కోకిల”,’పద్మశ్రీ” అవార్డు గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా తన ముందుకు సాగే శోభారాజు గారి లాంటి వారి వద్ద కీర్తనలు నేర్చుకోవడం ఎంతో గొప్ప విషయం. నేర్చుకోవడం యోగం నేర్పించడమే భోగం అనే నినాదంతో సాగే “వేసవి వెన్నెల” ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇపుడు అన్నమాచార్య సంకీర్తనలు నేర్పే మరో బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వయసుతో నిమిత్తం లేకుండా, సంగీత పరిజ్ఞానం లేకుండా, గాత్రం ఎలా ఉన్నా ఎవరైనా కీర్తనలు నేర్చుకోవచ్చు. 618వ అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ 2026 నుండి మే 1వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గం. ల నుండి 7:30 గం. ల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు, వివరాలకు రాజరాజేశ్వరి i+91 94412 76825, పద్మినీ – +919611144002, సౌజన్య – +91 95501 29946, పరిమళ – 9966002879, రమణ గోరింట్ల 9848024042 నంబర్లను సంప్రదించి తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకొనగలరు. ఈ విశేషాలను అందరికీ తెలియజేసి, మరింతమంది విద్యార్థుల రాకకు కారణభూతులవ్వాలని మీకు విన్నపము చేయుచున్నాము.
రమణ గోరింట్ల
9848024042






