ఎలాంటి అపచారం జరగలేదు : టీటీడీ

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, వదంతులు నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మవద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందే ప్రతీది తనిఖీ చేస్తాం. అవసరమైతే వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకా కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోగో ఏదో అపచారం జరిగినట్లుగా కొన్ని మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలో ఎలాంటి అపచారం జరగలేదు. భక్తులు ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలుస్తున్నాం అని టీడీపీ తెలిపింది.