TAGS: శాక్రమెంటోలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం, సంక్రాంతి క్రీడా సంబరాలు!
సాక్రమెంటో: గ్రేటర్ శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ (TAGS) ఆధ్వర్యంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం, సంక్రాంతి 2026 క్రీడా సంబరాలు నిర్వహించడానికి టీఏజీఎస్ కమ్యూనిటీ సభ్యులను ఆహ్వానిస్తోంది. భక్తి, సాంస్కృతిక వైభవం, కమ్యూనిటీ ఐక్యతను చాటిచెప్పే ఈ వేడుకలకు కుటుంబ సమేతంగా వచ్చి పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
శ్రీనివాస కళ్యాణం.. భక్తి పారవశ్యం
దివ్యమైన శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం శనివారం, జనవరి 10వ తేదీ, 2026 నాడు ఉదయం 8:00 గంటలకు Folsom Middle School (500 Blue Ravine Rd, Folsom, CA 95630) వేదికగా జరుగుతుంది.
ఈ వేడుకలో పాల్గొనేందుకు కమ్యూనిటీ సభ్యులు తప్పనిసరిగా TAGS మొబైల్ యాప్ (iOS & Android) ద్వారా లేదా https://sactelugu.org/registration లింక్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అందరూ తమ స్వతహాగా వాటర్ బాటిల్స్ తీసుకురావాలని సూచించారు.
క్రీడా సంబరాలు.. ఆటలు, ఆనందం
సంక్రాంతిని పురస్కరించుకుని టీఏజీఎస్ స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఈ క్రీడా వినోదంలో పాల్గొనవచ్చు.
చెస్, క్యారమ్స్, పెయింటింగ్ పోటీలు శనివారం, డిసెంబర్ 6వ తేదీ, 2025 నాడు ఉదయం 9:30 గంటల నుండి Chinmaya Mission (3231 Ramos Cir, Sacramento, CA 95827) వేదికగా జరుగుతాయి.
బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శనివారం, డిసెంబర్ 13వ తేదీ, 2025 నాడు ఉదయం 8:00 గంటల నుండి Northern California Badminton Club (NCBC, 2421 Mercantile Dr., Suite D, Rancho Cordova, CA 95742) వేదికగా నిర్వహిస్తారు.
టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్ పోటీలు ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ, 2025 నాడు ఉదయం 8:00 గంటల నుండి అదే ఎన్సీబీసీ వేదికలో జరుగుతాయి.
ఈ క్రీడా ఈవెంట్లలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
మరింత సమాచారం కోసం:
సంప్రదించండి: 916-932-TAGS (8247)
ఈమెయిల్: sactags@gmail.com
వెబ్సైట్: www.sactelugu.org
ఫేస్బుక్: facebook.com/SacTelugu
– B.Vishal






