శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి చేపట్టారు. మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ చేశాక సర్వ దర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో జె.శ్యామలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, జేఈవో గౌతమి, సీవీఎస్‌లో శ్రీధర్ పాల్గొన్నారు.