శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 3 నుంచి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 12 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. వేడుకల్లో ప్రతి రోజూ అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారన్నారు. 11న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడిరచారు.