ఎన్నారైలకు ప్రత్యేకం… శ్రీవల్లి ప్రవాస్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో గేటెడ్ కమ్యూనిటీకోసం, ప్రత్యేకంగా ఎన్నారైలకు సరిపోయే విధంగా ఉండవల్లి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ శ్రీవల్లి ప్రవాస్ ప్రాజెక్టును చేపట్టింది. ఉండవల్లి సంస్థ నిర్మించే ప్రాజెక్టులు తమ కలలకు ప్రతిరూపంలా ఉంటాయని, అందులో సకల సౌకర్యాలు ఉంటాయన్న విశ్వాసంతో ఎంతోమంది సంస్థ ప్రాజెక్టులలో గృహాలను కొంటుంటారు. కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంస్థ కూడా తమ ప్రాజెక్టులను నాణ్యతతో, అత్యాధునికమైన సౌకర్యాలతో నిర్మించి ఇస్తోంది. ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ శ్రీవల్లి ప్రవాస్ పేరుతో ఓ ప్రాజెక్టును మీ ముందుకు తీసుకు వచ్చింది. భూలోక స్వర్గాన్ని తలపించేలా ఇందులోని సౌకర్యాలు ఉంటాయని కంపెనీ పేర్కొంటోంది.
ఉండవల్లి మేనెజింగ్ డైరెక్టర్ రాము మాట్లాడుతూ, ప్రశాంతంగా, ఆనందంగా, లగ్జరీగా ఉండాలనుకునే వాళ్ళ కోసం శ్రీవల్లి ప్రవాస్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మీకు కావాల్సిన సౌకర్యాలను, ఊహలను నిజం చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. యూరోపియన్ క్లాసిక్ స్టైల్‌తో, సమకాలీన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణం ఉంటుందన్నారు. పల్లెదనం కనిపిస్తూనే, పట్టణీకరణ ఉండేలా ప్రాజెక్టును తీర్చిదిద్దామని చెప్పారు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చామని, అదే సమయంలో కావాల్సిన వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎయిమ్స్‌కు, ప్రముఖ పాఠశాలలకు దగ్గరగానే ఈ ప్రాజెక్టు ఉండటం మరొక ఆకర్షణ అని చెప్పారు. ఈ ప్రాజెక్టులో మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కు న్యాయం చేసేలా ఈ ప్రాజెక్టు మీకు ఉంటుందన్నారు. సకల సౌకర్యాలతో ఆధునిక స్వర్గాన్ని తలపించేలా ఈ ప్రాజెక్టు ఉందని అంటూ, మీ హృదయానికి హత్తుకునేలా శ్రీవల్లి ప్రవాస్ మీకు స్వాగతం పలుకుతుందని చెప్పారు.
ప్రత్యేకతలు
50 శాతం ఓపెన్ స్పేస్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 100శాతం వాస్తు, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, ఇంటర్‌కమ్ సౌకర్యం, ప్రతి బ్లాక్‌లోనూ రెస్ట్‌రూమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్, కిడ్స్ పూల్, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, మినిథియేటర్, యాంఫిధియేటర్, కెఫ్తీరియా, జిమ్నాజియం, ఏరోబిక్స్, మెడిటేషన్ హాల్, జాగింగ్ ట్రాక్, యోగా రూమ్, చిల్జ్రన్స్ ప్లే ఏరియా, ఔట్‌డోర్ క్రికెట్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, షటిల్ కోర్ట్, ఎల్డర్స్ పార్క్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు ప్రత్యేకంగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు.