హైదరాబాద్ రియల్ పై పిరమల్ క్యాపిటల్ దృష్టి

రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో పిరమల్ క్యాపిటల్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దీనిని దష్టిలో ఉంచుకొని రానున్న రెండేళ్లలో సుమారు ఐదు వేల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలో పెట్టాలని నిర?యించినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఖష్రు జిజినా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర?యం తీసుకున్నామని పేర్కొన్నారు. డిమానిటైజేషన్ తదితర ప్రభావాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో రియల్ రంగం స్థిరంగా ముందుకు సాగుతోందని చెప్పారు.