కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం…..విదేశీయులకు

స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుది. జవనరి 1, 2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆ మరుసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాటు బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు.