హైదరాబాద్ లో డబ్ల్యూఎన్ఎస్ డెలివరీ కేంద్రం ప్రారంభం

అమెరికాలోని న్యూయార్క్ స్టాక్‌ఎక్స్చేంజీలో నమోదైన డబ్ల్యూఎన్‌ఎస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ హైదరాబాద్‌లో తన నూతన డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. నానక్‌రామ్ గూడలోని ప్రిస్టిజ్ స్కై టెక్ భవనంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డబ్ల్యూఎన్‌ఎస్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థకు మనదేశంలో బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఇందౌర్, ముంబయి నోయిడా, పుణె, విశాఖపట్నంలో ఇటువంటి కేంద్రాలు ఉన్నాయి. షిప్పింగ్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, హైటెక్ రంగాలకు ఈ సంస్థ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లో నాణ్యమైన మానవ వనరుల లభ్యత తమకు మేలు చేస్తుందని, ఐటీ`బీపీఎం రంగాలకు ఇది ఎంతో అనువైన ప్రదేశమని డబ్ల్యూఎన్‌ఎస్ గ్రూపు సీఈవో కేశవ్ ఆర్.మురుగేశ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు వివిధ దేశాల్లో 66 డెలివరీ కేంద్రాలుండగా 60,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.