Kavitha: కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్…?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈనెల 25న పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటిస్తామని ఇదివరకే స్పష్టం చేశారు. అయితే లేటెస్టుగా ఆమె చేసిన సంచలనవ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ గురించి మాట్లాడేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత… మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మీ పార్టీ పేరేమిటి? అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ అన్న పేరు ఇప్పుడు ఫ్రీ అయ్యిందని, దానిని ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చని, అది ఇప్పుడు ఓపెన్ గానే ఉందని కవిత అన్నారు. అంతేకాకుండా పాత పేరు, కొత్త అజెండాతో తాను వస్తున్నానని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ గా కొనసాగుతున్న పార్టీ పేరు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరు తెలంగాణ వాదులను ఐక్యం చేయడంతో పాటు ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. చివరాఖరుకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానూ సాధించింది. అయితే ఒక లక్ష్యంగా ప్రారంభమైన టీఆర్ఎస్ తన లక్ష్యాన్ని సాధించిందని, దానిని ఇక దేశవ్యాప్తం చేయాలన్న భావనతో దాని పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఈ మార్పుపై తెలంగాణ వాదులతో పాటు రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. పార్టీ పేరు మార్చిన తర్వాత కేసీఆర్ ఓటమి చవిచూశారు.
ఇవి కూడా చదవండి






