Supreme Court: ఆ భూములపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు కొనుగోలు చేసిన భూములపై బీర్ల మల్లేష్ (Beerala Mallesh) అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ భూములను భూదాన్ భూములుగా పేర్కొంటూ తొలుత మల్లేశ్ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఐఏఎస్ (IAS,), ఐపీఎస్లకు (IPS) అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మల్లేష్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రాథమిక స్థాయిలోనే కొట్టివేసింది.






