Naveen Mittal: రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న నవీన్ మిత్తల్
ఇంధన పరిరక్షణలో ఉత్తమ పనితీరుతో దేశ వ్యాప్తంగా తెలంగాణ (Telangana) రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీఆర్‌ఈడీసీఓ) ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) లో అమలు చేసిన కూల్ రూఫ్ ఆఫ్ డెమో ప్రాజెక్టు కు ఈ అవార్డు దక్కింది. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు-2025 ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ (Naveen Mittal) అవార్డునందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar), రెడ్కో ఉపాధ్యక్షురాలు, మేనేజింగ్ డైరెక్టర్ అనిల, జనరల్ మేనేజర్ జి.ఎస్.వి.ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకట రమణ పాల్గొన్నారు.






