Chandrababu: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించిన ముఖ్యమంత్రి
• తెలుగు ప్రజల గౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన ఆత్మార్పణ చేశారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
• స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో, ఆ తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడారు
• పాలకుల వివక్ష కారణంగా నలిగిపోయిన తెలుగు వారికి రాష్ట్రాన్ని సాధించి పెట్టారు
• నమ్మిన సిద్ధాంతం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారు
• ఆయన కృషితోనే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది.
• ఆ తర్వాత నవంబరు 1, 1956న ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది
• కొందరు ఈ తేదీలపై రాజకీయం చేస్తున్నారు.
• అందుకే ఆలోచన చేసి అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ చేసిన దినాన్ని డే ఆఫ్ శాక్రిఫైస్ కింద నిర్వహించాలని నిర్ణయించాం
• వచ్చే ఏడాది మార్చి 16 వరకూ పొట్టి శ్రీరాములు శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాం
• భావితరాలకు గుర్తుండేలా పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నాం
• పొట్టిశ్రీరాములు త్యాగానికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు
• నేను నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టి కేంద్రానికి పంపాం. ఆ తర్వాతే కేంద్రం జిల్లా పేరును పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా నోటిఫై చేసింది
• చెన్నైలో ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని నిర్ణయించాం.
• భావితరాలకు గుర్తుండేలా దానిని మెమోరియల్ గా తీర్చిదిద్దుతాం
• పొట్టిశ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, సెంటిమెంట్, గుండె చప్పుడు
• పశ్చిమ గోదావరిలోని పెనుగొండ మండలానికి వాసవీ పెనుగొండగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం
• కన్యకాపరమేశ్వరి ఆత్మత్యాగం చేసిన రోజును కూడా ప్రభుత్వం అధికారికంగానే నిర్వహిస్తోంది.
• రకరకాల ప్రాంతాల్లో వేర్వేరు కుల ధృవీకరణ పత్రాలుగా కాకుండా ఇక నుంచి అందరికీ ఆర్యవైశ్యగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం
• పీ4ను అందిపుచ్చుకోవాలి
• నెల్లూరులోని ఆయన నివాసాన్ని కూడా మెమోరియల్‌గా తీర్చిదిద్దుతాం
• పొట్టిశ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజుకు గుర్తుగానే శాక్రిఫైస్ డేగా నిర్వహిస్తున్నాం
• అమరావతిలో నిర్మించే ఆయన విగ్రహాన్ని కూడా స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నిర్మిస్తున్నాం
• తెలుగువాళ్లం ఓ శాశ్వత చిరునామా లేకుండా తిరుగుతున్నాం. చెన్నైలో కొన్నాళ్లు, కర్నూలులో కొన్నాళ్లు, మరికొంత కాలం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం
• ఇప్పుడు అమరావతి నిర్మాణం చేసుకుంటున్నాం. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, తిరుపతి లాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం
• గతంలో హైదరాబాద్ ను నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం. దాని ద్వారా సర్వీసు సెక్టార్ పెరిగి ఆదాయం వస్తోంది
• ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫలాలు, చేపలు పండించే ప్రాంతంగా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది
• వ్యవసాయంతో పాటు పరిశ్రమలూ రావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది
• 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీనే
• మొన్నటి వరకూ మూడు రాజధానులని మహా కుట్ర చేశారు
• అసలు రాజధానే లేకుండా చేసి ప్రపంచం అంతా అపహాస్యం చేశారు
• గత ప్రభుత్వ హయాంలో కనీసం రాజధాని పేరు కూడా చెప్పుకోలేని స్థితి
• ఇప్పుడు గర్వంగా మన రాజధాని అమరావతి అని చెప్పుకోగలం
• మెడికల్ కాలేజీల విషయంలో కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. రహదారి పీపీపీ ద్వారానే నిర్మించి ఆఖరున ప్రభుత్వానికి అప్పజెబుతారు. అదే తరహాలో కాలేజీలను నిర్మిస్తున్నాం
• స్వయంగా పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీ మెరుగైన విధానం అని నివేదిక కూడా ఇచ్చింది
• కాలేజీలు కట్టినా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నాను
• పీపీపీ అనే విధానం వచ్చాకే రహదారులు, ఎయిర్ పోర్టుల లాంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి
• వాటి వల్ల ఆదాయం పెరిగి ప్రజల సంపద కూడా పెరుగుతుంది
• పేదవారిని ఆదుకోవడానికి పీ4 అనే విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది
• తెలుగు జాతిని నెంబర్ 1గా తీర్చిదిద్దినప్పుడే పొట్టిశ్రీరాములు స్పూర్తిని నిలబెట్టిన వారం అవుతాం
• చేసిన పనిని గుర్తించి అభినందిస్తే ప్రజాప్రతినిధులుగా, రాజకీయనాయకులుగా మా అందరికీ ఉత్సాహం కలుగుతుంది
• రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే ఎన్డీఏ కూటమి ఐక్యంగా తీసుకున్న నిర్ణయం
• అభివృద్ధికి, సంక్షేమానికి సమానంగా ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నాం
• పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా మార్చినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ప్లకార్డుల ప్రదర్శించిన ఆర్యవైశ్య మహిళలు.






