Sree Leela: క్రీమ్ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న లీలమ్మ
పెళ్లి సందడి2(Pelli Sandadi2) సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల(Sree Leela) చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందం, డ్యాన్సులతో యూత్ మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలీల ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే లేటేస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగా ధరించి దానికి మెడలో హెవీ డైమండ్ సెట్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, పాపిట బిళ్ల పెట్టుకుని ఎంతో అందంగా మెరవగా ఈ ఫోటోల్లో అమ్మడి అందాలను చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.






