Chandrababu: కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని (Kanha Shanti Vanam) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సందర్శించారు. సీఎంకు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ దాజీ (Kamlesh D Patel Daji) స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరి మధ్య ప్రత్యేక భేటీ జరిగింది. కన్నాహ శాంతివనలో హార్ట్ఫుల్నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై చంద్రబాబుకు దాజీ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో హార్ట్ఫుల్నెస్ కార్యాలయం (Heartfulness Office) ఏర్పాటుపై వారిద్దరూ చర్చలు జరిపారు.





