LATA: లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి మేళా 2026
LATA: లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (LATA) ఆధ్వర్యంలో 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని “LATA సంక్రాంతి మేళా 2026” ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ మేళాలో విక్రయదారులు (Vendor) తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకునేందుకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు.
ముఖ్య వివరాలు:
తేదీ: 2026 జనవరి 31వ తేదీ (శనివారం)
స్టాల్ సమయం: మధ్యాహ్నం 12 PM నుండి సాయంత్రం 6 PM వరకు
వేదిక: జాన్ ఎఫ్. కెన్నెడీ హై స్కూల్ (John F. Kennedy High School)
చిరునామా: 8281 Walker St, La Palma, CA 90623
రిజర్వేషన్ వివరాలు:
స్టాళ్లను రిజర్వ్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు కింది నంబర్లలో సంప్రదించవచ్చు.
హరి నేతి (Hari Nethi): 310-745-7830
చంద్రశేఖర్ గుత్తికొండ (Chandrasekhar Guthikonda): 424-386-9924
ఈ సంక్రాంతి మేళా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, వినోద కార్యక్రమాలతో అందరినీ అలరించనుంది. వ్యాపారవేత్తలు, గృహోపకరణాల విక్రేతలు, వస్త్రాలు, ఆభరణాల విక్రేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు సమాజంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చు.






