పిటిషనర్లకు నోటీసులిచ్చే భూముల్లోకి వెళ్లాలి : హైకోర్టు

అత్యంత కీలకమైన దేవరయాంజల్ భూముల్లోకి అధికారులు వెళ్లేముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు సహకరించక పోతే మాత్రం చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలోని దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటుకు సంబంధించిన జీవోను కొట్టేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆలయ భూములకు గుర్తించేందుకు కమిటీ వేస్తే పిటిషనర్లకు వచ్చిన ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అసలు ఏం జరిగిందన్న దానిపై విచారణ జరిపి, రిపోర్టును సమర్పించడం కమిటీ బాధ్యత అని వ్యాఖ్యానించింది. ‘‘కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనివ్వాలా?’’ అంటూ రుసురుస లాడింది. దేవరయాంజల్ భూములపై విచారణ జరిపే స్వేచ్ఛ ఆ కమిటీకి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.