KTR: కేటీఆర్‌కు గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు

బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్ఠాత్మకమైన గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు (Green Leadership Award) 2025్ణకు ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్(New York) లో ఈ నెల 24న నిర్వహించనున్న 9వ ఎన్‌వైసీ గ్రీన్ సూల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ (KTR) కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది. గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధ్రువీకరించడం మాకు ఒక విశేషం అని వారు ఆయనకు పంపిన లేఖలో పేర్కొన్నారు.