CM Revanth vs Messi: రేవంత్, మెస్సీ హోరాహోరీ.. గోల్ కొట్టి అలరించిన సీఎం.. సింగరేణి ఆర్ఆర్ టీం విజయం
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్.. సింగరేణి, మెస్సీ అపర్ణ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచులో మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అందరిని ఆకట్టుకున్నారు. యువకులతో పోటీ పడి మరీ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడంతో అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. అనంతరం గ్రౌండ్లోకి దిగిన మెస్సీ కాసేపు సీఎం రేవంత్‌తో గేమ్ ఆడారు. ఆ తర్వాత ప్లేయర్స్‌తో కలిసి ఫొటో దిగారు. అనంతరం బాల్స్‌ను మెస్సీ స్టేడియం స్టాండ్స్‌లోకి కిక్ చేశారు. దాదాపు అరగంటపాటు సాగిన ఆట రాత్రి 8.50కి ముగిసింది. అపర్ణ మెస్సీ టీంపై సింగరేణి ఆర్ఆర్ టీం విజయం సాధించింది.
మెస్సీకి వీడ్కోలు..
సీఎం రేవంత్, మెస్సీ ఆట ముగియగానే సీఎం, మంత్రివర్గ బృందం, అభిమానులు మెస్సీకి ఘన వీడ్కోలు తెలిపారు. సీఎం రేవంత్, రాహుల్ గాంధీకి మెర్సీ పేరుతో ఉన్న జెర్సీని మెస్సీ ప్రదానం చేశారు.






