Messi: ముఖ్యమంత్రి మనువడితో మెస్సీ ఫుట్బాల్ ఆట
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫీవర్తో ఊగిపోయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి వచ్చి చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన స్టేడియం మొత్తం తిరుగుతూ ఆడుతున్న పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలో, సీఎం రేవంత్ రెడ్డి తన మనువడిని మెస్సీకి పరిచయం చేశారు. ఆ తర్వాత మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మనవడితో కలిసి ఉల్లాసంగా ఫుట్బాల్ ఆడారు. ఈ ఆట పూర్తయిన తర్వాత, ఆ ముగ్గురూ (సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ, మనవడు) కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఉప్పల్ స్టేడియం మొత్తం ప్రేక్షకుల ‘మెస్సీ… మెస్సీ’ అంటూ జేజేలతో దద్దరిల్లిపోయింది.






