Gurram Papireddy: కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తున్న యూనిక్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” ట్రైలర్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్, క్యారెక్టర్ లుక్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…జడ్జి జి.వైద్యనాథన్(బ్రహ్మానందం) తెలివితక్కువ వాళ్లతో వ్యవహరించడంలో అనుభవజ్ఞుడు. అలాంటి ఆయన దగ్గరకు ఓ విచిత్రమైన కేసు హియరింగ్ కు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌధామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోస్గి) కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అక్కడికి మరికొందరు గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకి వస్తారు. ఆ దొంగలతో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిది, దాని కోసం హీరో గ్యాంగ్ తో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు వేట సాగిస్తున్నాయి. ఈ వేట కథను ఉడ్రాజు (యోగిబాబు) ఎలా మలుపుతిప్పాడు. 1927 నుంచి 1987 వరకు జీవించిన కలింగ పోతురాజు ఎవరు, శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకున్న లింకు ఏంటి అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇలాంటి వినూత్నమైన మూవీకి సరిపోయే పర్పెక్ట్ టీమ్ పనిచేసిందని చెబుతూ ట్రైలర్ కట్ చేయడం కొత్తగా ఉంది. బ్రహ్మానందం, యోగిబాబు, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, జీవన్ కుమార్, ప్రభాస్ శ్రీను వంటి మంచి పేరున్న ఆర్టిస్టులతో ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.






