Messi: మెస్సీ, సీఎం, రాహుల్ సమరం.. ఉప్పల్‌లో GOAT కప్ మ్యాచ్ షెడ్యూల్ ఇదే!
హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు (శనివారం) జరగబోయే ‘గోట్ కప్’ (GOAT Cup) ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు పాల్గొననున్న ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్ సాయంత్రం 7:50 గంటలకు ప్రారంభం కానుంది.
మ్యాచ్, ప్రముఖుల రాక వివరాలు:
ఎగ్జిబిషన్ మ్యాచ్ కిక్-ఆఫ్ రాత్రి 7:50 గంటలకు (19:50) మొదలవుతుంది.
ముందుగా, రాత్రి 8:06 గంటలకు (20:06) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైదానంలోకి అడుగుపెడతారు.
సీఎం వచ్చిన నిమిషానికే, సరిగ్గా 8:07 గంటలకు (20:07) లియోనెల్ మెస్సీ పిచ్‌పైకి వస్తారు.
ఆ తర్వాత 8:08 గంటలకు (20:08) ఇంటర్ మియామీ ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా మైదానంలోకి ప్రవేశిస్తారు.
రాత్రి 8:11 గంటలకు (20:11), లియోనెల్ మెస్సీ, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి బంతితో డ్రిబ్లింగ్ చేసి అభిమానులను అలరించనున్నారు.
ఆ తర్వాత 8:13 గంటలకు (20:13) గోట్ కప్ విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ జరగనుంది.
ముఖ్య కార్యక్రమాల మధ్యలో, 8:18 గంటలకు (20:18) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైదానంలోకి వస్తారు.
పిల్లలతో ‘టికీ టాకా’ క్లినిక్:
యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘టికీ టాకా’ (Tiki Taka – Children’s Clinic) పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు.
రాత్రి 8:16 గంటల (20:16) నుండి మొదలయ్యే ఈ క్లినిక్‌లో మెస్సీ, సువారెజ్, డి పాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ… మొత్తం నాలుగు జోన్లలో పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం 8:32 గంటల (20:32) వరకు కొనసాగుతుంది.
ఆ తర్వాత 8:33 గంటలకు (20:33) మెస్సీతో ప్రత్యేకంగా ఒక పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఈ షూటౌట్‌కి నిర్వాహకులలో ఒకరైన అనుత్తమ్ రెడ్డి గోల్ కీపర్‌గా వ్యవహరిస్తారు.
సన్మానాలు, వీడ్కోలు:
మైదానంపై కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ప్రముఖులు అభిమానులను ఉద్దేశించి మాట్లాడి, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాత్రి 8:38 గంటల (20:38) సమయంలో మెస్సీ, సీఎం, రాహుల్ గాంధీ, సువారెజ్, డి పాల్‌తో కలిసి స్టేడియం చుట్టూ నడుస్తూ అభిమానులకు అభివాదం చేస్తారు.
8:53 గంటలకు (20:53), మెస్సీ గోట్ కప్‌ను విజేత జట్టుకు అందజేస్తారు. మరో జట్టుకు రాహుల్ గాంధీ కప్‌ను అందిస్తారు.
తరువాత, 8:54 గంటలకు (20:54) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెస్సీని శాలువా, బహుమతితో సన్మానిస్తారు.
8:58 గంటలకు (20:58) సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత 8:59 గంటలకు (20:59) రాహుల్ గాంధీ తమ ముగింపు ప్రసంగం చేస్తారు.
రాత్రి 9:00 గంటలకు (21:00) ప్రముఖులందరూ స్టేడియం నుండి నిష్క్రమిస్తారు.






