Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్‌ను ప్రారంభించిన నాగార్జున, శ్రీలీల
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్, హైదరాబాద్‌లోని పంజాగుట్ట- బేగంపేట మెయిన్ రోడ్లో తమ నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ షో రూమ్‌ను సినీ నటులు నాగార్జున, శ్రీలీల ప్రారంభించారు. ఇక్కడ ముహూరత్ (వివాహ ఆభరణాల శ్రేణి ), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమా (టెంపుల్ జ్యువెలరీ), మరెన్నో ప్రసిద్ధ స్వంత బ్రాండ్లు ఉన్నాయి.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నమ్మకం, పారదర్శకత , వినియోగదారులు ముందు అనే సిద్ధాంతాన్నినిరంతరం సమర్థించే బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంది” అని పేర్కొన్నారు. “నగరంలోని ఆభరణాల ప్రేమికులు కళ్యాణ్ జ్యువెలర్స్ పట్ల తమ ఆప్యాయత, ప్రేమ, మద్దతును చూపుతారని మేము విశ్వసిస్తున్నాం. అదే సమయంలో బ్రాండ్ అసాధారణ సేవా ప్రమాణాలను, దాని విభిన్న శ్రేణి అద్భుతమైన ఆభరణాల కలెక్షన్ లను అభినందించగలరని నమ్ముతున్నాము ” అని శ్రీలీల అన్నారు.






