రాజకీయ శరణార్థిగా గుర్తించండి .. అమెరికా ప్రభుత్వాన్ని కోరిన

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటలిజెన్స్ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు సిట్ పోలీసులకు మరో ఝలక్ ఇచ్చారు. తెలంగాణలో తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తనను అమెరికా ప్రభుత్వం రాజకీయ శరణార్థిగా గుర్తించాలని దరఖాస్తు దాఖలు చేశాడు. ప్రభాకర్ రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరు కావడంతో రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని, తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని పిటిషన్‌లో తెలిపారు. తెలంగాణ పోలీసులు తను రాజకీయంగా వేధిస్తున్నారని, ప్రస్తుతం తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నానని అమెరికా ప్రభుత్వానికి ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు.