Minister Komatireddy :ఆర్అండ్ బీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ తనకు కుటుంబం వంటిదని, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమానమని, తనను కలిసేందుకు ఉద్యోగులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ సమయంలో అయినా తనను కలవచ్చని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy0 అన్నారు. ఎర్రమంజిల్లోని శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్ అండ్ బీ (R&B) శాఖ 2026 సంవత్సర క్యాలెండర్ను (Calendar) మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజునే అన్ని వివరాలతో డైరీ (Diary ) ఆవిష్కరణ చేయడం తొలిసారి అని అధికారులకు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీలు, సీఈలు, ఇంజినీర్లు,సిబ్బంది పాల్గొన్నారు.






