Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
లక్ష్మీ కళ్యాణం(lakshmi kalyanam) మూవీతో టాలవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఆ తర్వాత చందమామ(Chandamama) మూవీలో నటించి మెప్పించింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి నటించి భారీ క్రేజ్ ను సంపాదించుకున్న కాజల్, కొన్నేళ్లపాటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.
అయితే ఎంత బిజీగా ఉన్నా కాజల్ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ తన ఫాలోవర్లు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే కాజల్ తాజాగా న్యూ ఇయర్ కోసం కొత్తగా మేకోవర్ అయి దానికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బెడ్ పై పడుకుని, మిర్రర్ ముందు స్టైలిష్ గా కూర్చుని ఫోటోలకు పోజులివ్వగా ఈ ఫోటోల్లో అమ్మడి అందాలు యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.






