CP Sajjanar: సీపీ సజ్జనార్ వార్నింగ్ … మద్యం తాగి పట్టుబడితే
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. మద్యం (Alcohol) తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) తనిఖీలు చేపడతామని చెప్పారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తామన్నారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) రద్దు తదితర చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.






