Minister Komatireddy: ఆ 10 రోజులు టోల్ వద్దు : మంత్రి కోమటిరెడ్డి
సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్భంగా హైదరాబాద్వి-జయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతివ్వాలని తెలంగాణ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ -హైదరాబాద్ రూట్లో టోల్ రుసుము లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని కోరారు. సంక్రాంతి పండుగ రోజుల్లో 200 శాతం అధికంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. టోల్ గేట్ల (Toll gates) వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా అనుమతివ్వాలని కోరారు.






