JP Nadda: మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటండి: నడ్డా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు (Ramachandra Rao) ఢల్లీిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు రామచందర్‌రావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా సర్పంచులు (Sarpanches), వార్డు సభ్యుల స్థానాల్లో పార్టీ మద్దతుదారులు గెలవడంపై జేపీ నడ్డా అభినందించారని అన్నారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌లు (Congress) రెండు పాలనలో వైఫల్యం చెందాయని తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని నడ్డా దిశానిర్దేశం చేశారని వెల్లడిరచారు. తెలంగాణలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. తెలంగాణకు రావాలని నడ్డాను ఆహ్వానించారు. పార్టీని మరింత పటిష్ఠం చేయడంతో పాటు సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాంచందర్‌రావుకు నడ్డా దిశానిర్దేశం చేశారు.






