KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harish Rao) , పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ (Telangana)లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






