BJP: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : లక్ష్మణ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలేనని, తెలంగాణలో రాబోయేది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ (K. Lakshman) అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి (Vajpayee) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముషీరాబాద్ (Mushirabad) వాలీబాల్ గ్రౌండ్లో స్థానిక కార్పొరేటర్ సుప్రియానవీన్గౌడ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండేళ్లలో నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్పై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని అన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






