Advisers: ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారుల (Advisers)ను నియమించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మాస్ కమ్యూనికేషన్స్)గా ప్రముఖ కార్టూనిస్టు పోచంపల్లి శ్రీధరరావు (Pochampally Sridhara Rao) (కార్టూనిస్ట్ శ్రీధర్)ను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శ్రీధర్‌తోపాటు యోగా, నేచురోపతి సలహాదారుగా ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణరాజు (Mantena Satyanarayana Raju)ను నియమించారు. చుండూరి సీతారామాంజనేయప్రసాద్ను (Seetharama Anjaneya Prasad) రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ సలహాదారుగా నియమించారు. వీరు రెండేళ్లపాటు సలహాదారులుగా కొనసాగనున్నారు.






