Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshan) సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన సీఎంకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.






