Chandrababu: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కీలకం కావాలి : సీఎం చంద్రబాబు
రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్యూఎస్), ఏపీటీఎఫ్ , ఏపీఎన్జీజీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల క్యాలెండర్ (Calendar), డైరీలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
సీఎం చంద్రబాబును ఏపీ ఎన్జీజీవో అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి రమణ, ఏపీ జేఏసీ అమరావతి కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, రఘునాథరెడ్డి (Raghunathareddy), హృదయరాజు, మంజులు, శ్రీనివాస్, పెన్షనర్స్, సీపీఎస్, గ్రామ/వార్డు సచివాలయ, ఏపీపీఏవో, ఎన్జీవో, క్లాస్ 4 ఎంప్లాయిస్, వెటర్నరీ, ఏఈవో, ట్రెజరీ, ఆర్ఎ్సవో, రెవెన్యూ, ఆర్టీసీ ఈయూ, ఆర్టీసీ ఎన్ఎంయూ, కో-ఆపరేటివ్, లేబర్ ఆఫీసర్, పీఆర్ ఇంజనీర్ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా సంఘాలకు చెందిన క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు.






